నిజం తో నాకు పని లేదు
నిజాన్ని ఆరా తీసి వ్రాసే ఓపిక నాకు లేదు

నిజం తో నాకు పనిలేదు
నిజం ఏమిటో తెలుసుకునే ఓపిక నాకు లేదు
నిజం ఏంటో ఆరా తీసి రాసే అంత సమయం నాకు లేదు.
నాకు తోచింది నేను చెప్పేయాలి
నాకు అనిపించింది రాసేయాలి
సోసియల్ మీడియా లో ఓ కంటెంట్ కావాలి
అందులో నిజానిజాలతో నాకు సంబంధం లేదు
అందరి కంటే ముందు నేను ఉండాలి
ఎవడెప్పుడు చస్తాడా అని వేచి ఉండడం
RIP రాసేయాలంతే అది కూడా మొదట పోస్ట్ నేనే పెట్టాలి
ఇదే నేడు సోసియల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన
వీటివల్ల కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి.
రెండో కోణం అన్నది ఒకటి ఉంటుంది అనేదే వీరికి అనవసరం
కొన్ని కుటుంబాలు విడిపోతున్నాయి
పిల్లలు తల్లితండ్రులకు దూరం అవుతున్నారు
ఇద్దరి ప్రేమ కోసం ఆ పిల్లలు పడిగాల్పులు కాయాలి
ఇదిగో ఈ చిత్రమే చెబుతుంది మనకు కనిపించేది ఒకటి. నిజానికి అక్కడ జరిగేది వేరొకటి.
ఆ రెండో విషయంతో మాకు సంబంధం లేదు మాకు కనిపించింది నిజం
మాకు కనిపించిందే నిజం అవ్వాలి
ఇటువంటి వారికి నిజంగా RIP
What's Your Reaction?






