ఈ నెల 27న ఎంపీ, ఎమ్మెల్యే పర్యటన
కూటమి నాయకులకు ఆహ్వానం

రాజభారత్ న్యూస్, ఆంధ్రప్రదేశ్, అవనిగడ్డ (26-01-2025) : అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఈనెల 27న నియోజకవర్గంలో పర్యటిస్తారు.
సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు రక్షిత మంచినీటి పథకాల అభివృద్ధి కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఘంటసాల మండలం యండకుదురులో బీపీసీఎల్ సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
10 గంటలకు నాగాయలంక మండలం కమ్మనమోలలో బీపీసీఎల్ సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
11 గంటలకు నాగాయలంక మండలం మూలపాలెం శివారు దీనదయాళపురంలో బీపీసీఎల్ సీఎస్ఆర్ నిధులు రూ.18.50 లక్షలతో ఇరవై వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
12 గంటలకు నాగాయలంక మండలం గుల్లలమోదలో పీ.ఎఫ్.సీ సీఎస్ఆర్ నిధులు రూ.1,65,83,800లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. రూ.12,08,300లతో మోటారు సేకరణ, ముంపునకు గురైన వ్యవసాయ పొలాల కోసం షెడ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేస్తారు.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సీఎస్ఆర్ నిధులు రూ.17 లక్షలతో సురక్షిత త్రాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేస్తారు.
మధ్యాహ్నం మూడు గంటలకు అవనిగడ్డ మండలం రామచంద్రాపురంలో బీపీసీఎల్ సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో రక్షిత మంచినీటి పథకం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?






