పైల్స్ ఆయుర్వేదం పరిష్కార మార్గం.

రాజభారత్ న్యూస్ (26-01-2025) : పైల్స్.. ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య. ఎవరికీ చెప్పుకోలేక.. కూర్చోలేక, నడవలేక.. ఇలా ప్రతీ విషయంలోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే ఈ పైల్స్ బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదంలో పరిష్కారం మార్గం
కావాల్సిన పదార్థాలు....
బియ్యం .1 కప్పు
పిప్పళ్ల పొడి. 1చెంచా
శొంఠి చూర్ణం .1చెంచా
మజ్జిగ - గ్లాసు
మిరియాల పొడి .1చెంచా
తయారీ విధానం....
ముందుగా స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి 10 కప్పుల నీటిని పోసి వేడి చేసుకోవాలి.నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు బియ్యం వేసుకుని మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.(జావలాగా ఉడికించుకుంటే మంచిది)ఇలా మెత్తగా ఉడికే క్రమంలోనే శొంఠి, పిప్పళ్ల చూర్ణాన్ని అందులో కలపాలి.ఇవన్నీ వేశాక ఒక నిమిషం పాటు ఉడకనిచ్చి స్టౌ ఆఫ్ చేసుకోవాలి.ఆ తర్వాత దీనిని ఓ గిన్నెలో తీసుకుని అందులోనే మజ్జిగ, మిరియాల పొడిని కలపితే పథ్యాహారం రెడీ!
ఎలా తీసుకోవాలి.....??
ఈ ఔషధాన్ని భోజనం చేసే ఏ సమయంలోనైనా తీసుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్ గాయత్రీ దేవీ. రోజులో ఒకసారి ఈ జావను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల పైల్స్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఒకవేళ మీరు భోజనం చేశాక మజ్జిగ అన్నం తినే వారు అయితే, దానిని మానేసి ఈ ఔషధాన్ని తీసుకోండి.
పైన చెప్పిన విధంగా సుమారు 4 నుండి 5నెలలు వాడవలసి ఉంటుంది.
What's Your Reaction?






